Drugs seized in delhi airport: పంజాబ్, గుజరాత్‌లలో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడుతున్న నేపథ్యంలో దిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఆపరేషన్ 'బ్లాక్ & వైట్' పేరుతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నిర్వహించిన తనిఖీల్లో 62 కిలోల హెరాయిన్‌ను బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ కార్గో నుంచి 55 కిలోలను సీజ్ చేసిన అధికారులు నిందితుడి అరెస్ట్ చేశారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించిన అధికారులు మరో 7కిలోలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.434 కోట్లు అని వెల్లడించారు. ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి దుబాయ్ మీదుగా వీటిని భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
ఎయిర్‌పోర్ట్‌లో 62 కిలోల హెరాయిన్ సీజ్.. విలువ రూ.430 కోట్ల పైనే!
Drugs seized in delhi airport: దిల్లీ విమానాశ్రయంలో రూ.434 కోట్లు విలువ చేసే హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 62 కిలోల ఈ హెరాయిన్‌ను ఉగాండా నుంచి దుబాయ్ మీదుగా భారత్‌కు తరలించేందుకు నిందితులు యత్నించారని అధికారులు తెలిపారు. మరోవైపు మణిపుర్లో కూడా హెరాయిన్ తరలింపును అడ్డుకున్నారు అక్కడి అధికారులు.
మణిపుర్‌లోనూ: సబ్బు పెట్టెల్లో హెరాయిన్ తరలించేందుకు యత్నించిన నిందితులను మణిపుర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.13 కిలోలు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 212 సబ్బు పెట్టెల్లో నిందితులు వీటిని తరలించేందుకు యత్నించారని.. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.31.80 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. నిందితులు.. చురచాంద్పుర్ జిల్లాకు చెందిన సోన్లైసీ హాకిప్, జామ్గౌలెన్ హాకిప్లుగా గుర్తించారు. వీరికి సహకరించిన ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి :ఆస్పత్రి వద్ద క్షుద్రపూజలు.. చనిపోయిన పప్పూ ఆత్మను సీసాలో బంధించాలని...