Drugs seized in Assam: అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు అసోంలోని కాచర్ జిల్లా పోలీసులు. జిరిఘాట్ ప్రాంతంలో సుమారు రూ.42 కోట్లు విలువైన మాదకద్రవ్యాలను గురువారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కామరూప్ స్టేషన్ పోలీసులు తెలిపారు. పట్టుకున్న డ్రగ్స్‌లో అర కిలో హెరాయిన్, 1.5 లక్షల యాబా మాత్రలు ఉన్నట్లు చెప్పారు.
జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ పార్థ సారధి మహంతా నేతృత్వంలో జిల్లాలోని సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఓ ట్రక్కును తనిఖీ చేయగా భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. అరెస్ట్ చేసిన ముగ్గురిలో ఇద్దరు ఫిరోఖాన్, ఎలియాస్ ఖాన్లు సరిహద్దు రాష్ట్రం మణిపుర్‌కు చెందిన వారు కాగా.. సద్దామ్ అలియాస్ సమినుల్ హఖ్ బంగాల్లోని కూచ్ బిహార్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.