తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అపార్ట్​మెంట్​లో అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీ.. విదేశీ యువతుల అరెస్ట్! - కర్ణాటక

అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీపై దాడులు చేసిన పోలీసులు విదేశీ యువతులతో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్న సంఘటన బెంగళూరులో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ పార్టీ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Drugs Party in Bengaluru
బెంగళూరు డ్రగ్స్​ పార్టీ

By

Published : Jun 19, 2022, 10:35 AM IST

ఓ అపార్ట్​మెంట్​లో నిర్వహిస్తున్న డ్రగ్స్​ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. విదేశీ యువతులతో పాటు ఓ యువకుడు, యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెన్నూర్​ పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇదీ జరిగింది:నగర శివారు హెన్నూర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో శుక్రవారం అర్ధరాత్రి డ్రగ్స్​ పార్టీ జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న పలువురు విదేశీ యువతులు సహా ఇతర రాష్ట్రాల యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిని వైద్య పరీక్షల కోసం పంపించామన్నారు. తదుపరి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details