Drugs Karnataka: కర్ణాటక హుబ్లీ రైల్వేస్టేషన్‌లో దాదాపు కిలో పరిమాణంలో ఉన్న ప్రమాదకర డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఉగాండకు చెందిన మహిళ నుంచి ఈ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితురాలు దిల్లీ నుంచి ఈ డ్రగ్స్ తీసుకువచ్చిందని అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా చిన్నపిల్లలకు ఆహారంగా అందించే సెర్లాక్ ప్యాకెట్లలో డ్రగ్స్ తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన డ్రగ్ అత్యంత ప్రమాదకరమైందని అధికారులు వివరించారు. దీర్ఘకాలంలో నాడీవ్యవస్థను ప్రభావితం చేయడంతో పాటు గుండె సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి దుష్ప్రభావాలకు లోనయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఇదీ చదవండి: