తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సూట్​కేస్​లో రూ.15కోట్ల డ్రగ్స్​తో దర్జాగా మహిళ జర్నీ.. చివరకు... - జైపుర్​లో డ్రగ్స్​

Drugs In Jaipur Airport: విదేశాల నుంచి భారత్​కు మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న ఓ మహిళను విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 2 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.15 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.

Drugs In Jaipur Airport:
ఎయిర్​పోర్ట్​లో హెరాయిన్ సీజ్​

By

Published : Dec 19, 2021, 3:20 PM IST

Drugs In Jaipur Airport: రాజస్థాన్​లోని జైపుర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి భారత్​కు ఓ మహిళ అక్రమంగా తరలిస్తుండగా.. వీటిని పట్టుకున్నారు.

Heroin from woman: ఎయిర్ అరేబియా విమానంలో షార్జా నుంచి రాజస్థాన్​ జైపుర్​ విమానాశ్రయానికి ఓ ఆఫ్రికన్​ మహిళ ఆదివారం ఉదయం చేరుకుంది. విమానాశ్రయంలో ఆమె అనుమానాస్పదంగా కనిపించగా అధికారులు ఆమె బ్యాగును తనిఖీలు చేశారు. సూట్​ కేస్​లో డ్రగ్స్ లాంటి పొడిని గుర్తించారు. వెంటనే డ్రగ్ డిటెక్టివ్​ బృందానికి సమాచారం అందించగా.. వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాంతో అది హెరాయిన్​గా తేలింది.

సదరు మహిళ వద్ద నుంచి రెండు కిలోలకు పైగా హెరాయిన్​ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.15 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. కస్టమ్స్​ అధికారులతో పాటు డైరెక్టరేట్ ఆఫ్​ రెవెన్యూ ఇంటెలిజెన్స్​ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

గతంలో జైపుర్​ విమానాశ్రయంలో ఇదే తరహాలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ఇదీ చూడండి:ఫైరింగ్ ప్రాక్టీస్​లో​ అపశ్రుతి.. జవాను మృతి

ఇదీ చూడండి:Guys Fighting in Gym: జిమ్​లో.. డబ్ల్యూడబ్ల్యూఈని తలపించేలా 'ఫైట్'​

ABOUT THE AUTHOR

...view details