దేశంలో డ్రగ్స్ సరఫరాను అరికడదామని పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా...అది నెరవేరడం లేదు. విసృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నా.. కొత్త విధానాలను అవలంబిస్తూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా కొరియర్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని తెలిసి కేరళ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఎక్కువగా యువతే...
గత కొద్ది రోజులుగా డాగ్‌స్క్వాడ్ సహాయంతో పోలీసులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కేరళ రాష్ట్రం కసర్గడ్ జిల్లాలో గత 20 రోజులుగా సుమారు వంద కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వాళ్లలో యువత ఎక్కువగా ఉన్నారని చెప్పారు. 243.38 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.