కరోనాపై పోరులో మరో కీలక అస్త్రం వైద్యులకు అందుబాటులోకి రానుంది. రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారిపై ఇది బాగా పని చేస్తోంది. కరోనా రోగులకు చికిత్స చేస్తూ అదనంగా ఈ ఔషధాన్ని ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉందని డీఆర్డీఓ.. ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్‌లో రుజువైనట్లు తెలిపింది. ఈ ఔషధం పొడి రూపంలో ఉండి, సాచెట్లలో వస్తుంది. దీనిని నీళ్లలో కలుపుకొని తాగితే చాలు. ఇది వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీఓ తెలిపింది.
ఈ ఔషధం జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్ అనలాగ్ కావడం వల్ల ఉత్పత్తి చాలా సులువని, పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంటుందని డీఆర్డీఓ వెల్లడించింది. ఇది వాడిన కరోనా రోగులు ఇతర కరోనా రోగుల కంటే వేగంగా కోలుకున్నట్లు తెలిపింది. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌తో కలిసి డీఆర్డీఓ ల్యాబ్...ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ దీన్ని అభివృద్ధి చేసింది.
వైరస్‌పై సమర్థవంతంగా..