క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. బెయిల్‌కు సంబంధించి మొత్తం 14 షరతులు విధిస్తూ పూర్తి స్థాయి ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది.
రూ. లక్ష రూపాయల పర్సనల్ బాండ్‌తో పాటు.. అంతే మొత్తంలో ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది కోర్టు. 5 పేజీల బెయిల్ ఆర్డర్‌పై జస్టిస్ ఎన్‌డబ్ల్యూ సాంబ్రే శుక్రవారం మధ్యాహ్నం సంతకం చేశారు.
బెయిల్ షరతులు ఇవే..
- రూ. లక్ష పర్సనల్ బాండ్
- ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు
- ప్రత్యేక కోర్టుకు పాస్‌పోర్ట్ అప్పగించాలి.
- కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదు.
- మళ్లీ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడకూడదు.
- సహ నిందితులతో మాట్లాడటం, కలవడం చేయకూడదు.
- ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 11-2 గంటల సమయంలో.. ముంబయి ఎన్సీబీ కార్యాలయానికి రావాలి.
ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాకు కూడా బెయిల్ లభించింది. ప్రస్తుతం వీరు ముంబయి ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నారు. క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి ఎన్సీబీ వీరిని 25 రోజుల కింద అరెస్టు చేసింది.
ఇదీ చూడండి:పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్