తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీరం టీకా వినియోగంపై డీసీజీఐ నిర్ణయం అప్పుడేనా?

సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ టీకా అత్యవసర వినియోగం అభ్యర్థనపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)​. ఈ మేరకు భేటీ కానున్న నిపుణుల కమిటీ తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.

Drug control authority india decision on Emergency use of Covishield in India
సీరం టీకా అత్యవసర వినియోగంపై డీసీజీఐ నిర్ణయం!

By

Published : Dec 30, 2020, 4:18 PM IST

సీరం టీకా అత్యవసర వినియోగంపై బుధవారం నిర్ణయం తీసుకోనుంది భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నిపుణుల బృందం. సీరం సంస్థ విజ్ఞప్తిపై భేటీకానున్న నిపుణుల కమిటీ.. నిర్ణయాన్ని వెల్లడించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

తాము అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్​ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని గతంలో అభ్యర్థించింది సీరం. అయితే టీకాకు సంబంధించి అదనపు సమాచారం కోరింది డీసీజీఐ నిపుణుల కమిటీ. అదనపు సమాచారం అందించిన సీరం.. అత్యవసర వినియోగానికి మరోసారి విజ్ఞప్తి చేసింది.

కరోనా నివారణకు కొవిషీల్డ్​ టీకాను అభివృద్ధి చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్‌.. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోంది.

ఇదీ చూడండి:కొత్త 'స్ట్రెయిన్'పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ

ABOUT THE AUTHOR

...view details