మత్తుకు బానిసైన ఓ యువకుడు.. 50 రూపాయల పంచాయతీ కారణంగా.. ఇంటికి ఎదురుగా ఆడుకుంటున్న 18నెలల చిన్నారిని చంపాడు. ఎట్టకేలకు ఆరు నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు.
ఏం జరిగిందంటే..
హరియాణా ఫరీదాబాద్‌లోని ఖేరా కలాన్, సెక్టార్-56లో నరేశ్ అలియాస్ బిన్ను(22) నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి పక్కనే షా మహమ్మద్ కుటుంబం నివసిస్తోంది. అయితే ఘటన జరగక రెండురోజుల ముందు.. షా మహమ్మద్ కుమార్తె(8) వద్ద నుంచి రూ. 50 కాజేశాడు బిన్ను. ఈ ఇదే విషయంపై షా, బిన్ను వాగ్వాదానికి దిగారు. దీంతో షా కుటుంబంపై బిన్ను కక్ష పెంచుకున్నాడు.