పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ (Ind Pak border) సరిహద్దుల్లో మరోసారి డ్రోన్లు కలకలం రేపాయి. పాక్ నియంత్రణ రేఖ వెంట డ్రోన్లను(drones spotted) గుర్తించిన సాయుధ దళాలు వాటిపై కాల్పులు జరిపినట్లు సైనికాధికారి ఒకరు తెలిపారు. దీంతో డ్రోన్లు తిరిగి పాకిస్థాన్‌కు (Ind Pak border) వెళ్లిపోయినట్లు వెల్లడించారు. డ్రోన్లు సంచరించిన ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది, దర్యాప్తు సంస్థలు పరిశీలించాయి.
Ind Pak border: సరిహద్దులో మళ్లీ పాక్ డ్రోన్ల కలకలం.. - drone news latest
పంజాబ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్లను(India Pak border) గుర్తించినట్లు సైనికాధికారి ఒకరు వెల్లడించారు. ఆ డ్రోన్లపై (drones spotted) సాయుధ దళాలు కాల్పులు జరపగా.. తిరిగి పాక్‌వైపు వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు.
పంజాబ్‌లో డ్రోన్ల కలకలం
పంజాబ్‌లో కొన్ని రోజులుగా డ్రోన్ల సంచారం పెరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్(Punjab CM news ).. హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు చాలా రోజులుగా పాక్ ప్రయత్నిస్తోందని.. వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు పంజాబ్ డీజీపీ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.