తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​కు బాంబులతో మరో డ్రోన్- కూల్చేసిన పోలీసులు - జమ్ముకశ్మీర్​ కనచక్​ వార్తలు

జమ్ముకశ్మీర్​లో కనచక్​లో సంచరిస్తున్న ఓ డ్రోన్​ను అధికారులు కూల్చేశారు. డ్రోన్​కు అమర్చిన 5 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

drone in jammu kashmir
జమ్ముకశ్మీర్​లో డ్రోన్​

By

Published : Jul 23, 2021, 9:32 AM IST

జమ్ముకశ్మీర్​లోని కనచక్ ​ప్రాంతంలో శుక్రవారం మరోసారి డ్రోన్​ సంచారం కలకలం సృష్టించింది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపారు. దాంతో ఆ డ్రోన్​ కింద పడింది. డ్రోన్​ నుంచి 5 కిలోల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు పట్టుకున్న డ్రోన్​
డ్రోన్ నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు

బుధవారం సత్వారీ ప్రాంతంలో ఓ అనుమానిత డ్రోన్​ను అధికారులు గుర్తించారు. అంతకుముందు జులై 16న.. జాతీయ భద్రతా దళం(ఎన్​ఎస్​జీ) ఏర్పాటు చేసిన యాంటీ డ్రోన్ సిస్టమ్​ రాడార్స్​.. జమ్ముకశ్మీర్​ ఎయిర్​ బేస్​పై తిరుగుతున్న డ్రోన్​ జాడను పసిగట్టాయి. గత నెలలో జమ్ముకశ్మీర్​లోని ఎయిర్​బేస్​పై డ్రోన్​ దాడి జరిగిన నేపథ్యంలో.. అప్రమత్తమైన ఎన్​ఎస్​జీ ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్​ను ఏర్పాటు చేసింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details