తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​ వలపు వలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. కీలక సమాచారం చేరవేత - విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లేటెస్ట్​ న్యూస్​

పాక్​ వలపు వలలో చిక్కుకున్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉద్యోగిని పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. భద్రతా దళాల సహాయంతో నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

pakistan honey trap
వలపుల వల

By

Published : Nov 18, 2022, 8:01 PM IST

వలపు వలలో చిక్కుకుని పాకిస్థాన్​కు దేశ రహస్యాలు చేరవేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డ్రైవర్​గా పనిచేసే ఓ వ్యక్తి పాక్ వలపు వలలో చిక్కుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే అతడ్ని పాకిస్థాన్​కు చెందిన గూఢచార సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ హనీట్రాప్​ చేసిందని తెలిపారు. పక్కా సమాచారంతో దిల్లీ పోలీసులు.. భద్రతా దళాల సాయంతో అతన్ని అరెస్ట్​ చేశారు. ప్రస్తుతం నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details