Driver Stopped Train for Tea in Siwan: సాధారణంగా ఛాయ్ కోసం బస్సును ఆపడం చూసుంటాం. అదే ఛాయ్ కోసం ట్రైన్ ఆగడం ఎప్పుడైనా చూశారా? బిహర్‌లోని సివాన్‌లో ఓ ట్రైన్ డ్రైవర్ టీ కోసం ఏకంగా ట్రైన్నే ఆపేశాడు. ట్రైన్ డ్రైవర్‌కు తల నొప్పి వచ్చిందేమో.. మార్గమధ్యంలోని క్రాసింగ్ వద్దే ఆపేశాడు. రైలులోని ప్రయాణికులతో పాటు రోడ్డుపై ఉన్న వాహనదారులు కూడా అవస్థలు పడ్డారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వైరల్‌గా మారింది.
ఛాయ్ కోసం ట్రైన్నే ఆపేసిన డ్రైవర్ - బిహర్ న్యూస్
Driver Stopped Train for Tea in Siwan: ఛాయ్ భారతీయుల జీవితాల్లో భాగమైపోయింది. అలాంటి ఛాయ్ కోసం బిహర్‌లోని ఓ డ్రైవర్ ఏకంగా ట్రైన్నే ఆపేశాడు. టీ వచ్చాకే ట్రైన్‌ను ముందుకు తీశాడు. ఈ దృశ్యాన్ని చూసిన వ్యక్తి ఫొటోలు తీయడం వల్ల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదీ జరిగింది: ఝాన్సీ నుంచి గ్వాలియర్ వెళ్తున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5: 27కు సివాన్ స్టేషన్ వద్దకు చేరుకుంది. ఇంతలో ఛాయ్ కోసం దిగిన గార్డు ఎక్కలేదని తెలుసుకున్న డ్రైవర్.. బయలుదేరాల్సిన సమయం కావడం వల్ల క్రాసింగ్ వద్దకు తీసుకెళ్లి నిలిపివేశాడు. గార్డు ఛాయ్ తీసుకువచ్చి.. డ్రైవర్‌కు ఇచ్చాకే ట్రైన్ బయలుదేరింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై విచారణ చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు.
కొద్దిరోజుల క్రితం రాజస్థాన్‌లో కచోడీ కోసం ట్రైన్ ఆపాడు మరో డ్రైవర్. మన దేశంలో ఇలా ఉంటే మరోవైపు జపాన్‌లో మాత్రం ట్రైన్ ఒక్క నిమిషం ఆలస్యం అయినందుకు డ్రైవర్ జీతాన్ని కట్ చేశారు అధికారులు. హిరోఫుమీ వాడా(59).. పశ్చిమ జపాన్ రైల్వేలో డ్రైవర్. 2021 జూన్ 18న ఒకాయమా స్టేషన్లో అతడు విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రయాణికులంతా దిగేశాక ఖాళీగా ఉన్న రైలును ప్లాట్‌ఫాం నుంచి డిపోలోకి తీసుకెళ్లడం అతడి విధి. అయితే.. పొరపాటున హిరోఫుమీ ఒక ప్లాట్‌ఫాంకు బదులు మరొకదానికి వెళ్లాడు. వెంటనే తిరిగి వచ్చి రైలును డిపోకు తీసుకెళ్లాడు. అయితే.. అప్పటికే నిమిషం ఆలస్యమైంది. దీనిని తీవ్రంగా పరిగణించింది పశ్చిమ జపాన్ రైల్వే యాజమాన్యం. హిరోఫుమీ నిమిషం పనిచేయలేదంటూ అతడి జీతంలో 56 యెన్(సుమారు రూ.34) కోత పెట్టింది. దీనిపై న్యాయపోరాటం చేసి, చివరకు గెలిచాడు వాడా. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.