తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాహనం సీక్రెట్​ పైపులో 23కేజీల బంగారం స్మగ్లింగ్.. ఒకే నెలలో 121కిలోలు సీజ్ - punjabn amrtisar border

మయన్మార్​ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23.23 కిలోల బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు ఈశాన్య ప్రాంత సరిహద్దులో స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, పంజాబ్​లోని అమృత్​సర్​ సరిహద్దులో నాలుగు హెరాయిన్​ ప్యాకెట్లను బీఎస్​ఎఫ్ దళాలు​ స్వాధీనం చేసుకున్నాయి.

dri seized
dri seized

By

Published : Oct 5, 2022, 4:04 PM IST

మయన్మార్​ నుంచి భారత్​లోకి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23.23 కిలోల బంగారాన్ని డైరక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటిలిజెన్స్​(డీఆర్‌ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగుర్ని అరెస్ట్​ చేశారు.
అధికారుల సమాచారం ప్రకారం..గత నెల 28-29న డీఆర్​ఐ అధికారులు సెర్చ్​ ఆపరేషన్​ చేపట్టారు. శిలిగుడి- గువాహటి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదే సమయంలో ఆ మార్గంలో నలుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. అనుమానం వచ్చిన అధికారులు.. వాహనాలను ఆపి రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. వాహనం లోపలి భాగంలో 23.23 కిలోల బంగారాన్ని 21 భాగాలు చేసి దాచినట్లు గుర్తించారు.

డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్న 23.23 కిలోల బంగారం

వాహనం వెనుక భాగంలో ఉన్న రెండు చక్రాలను కలిపే క్రాస్-మెంబర్ మెటల్ పైపు లోపల బంగారాన్ని దాచారు స్మగ్లరు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. మొత్తంగా.. సెప్టెంబర్ నెలలో ఈశాన్య కారిడార్‌లో 121 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 11 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

పాక్​ సరిహద్దులో హెరాయిన్​ ప్యాకెట్లు..
పంజాబ్​లోని అమృత్​సర్​ సరిహద్దులో నాలుగు హెరాయిన్​ ప్యాకెట్లను బీఎస్​ఎఫ్ దళాలు​ స్వాధీనం చేసుకున్నాయి. దీంతో పాటు 9 మి.మీ 50 లైవ్​ క్యాట్రిడ్జ్​లను కూడా స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్​ వైపు నుంచి ముళ్ల తీగ ద్వారా దుండగులు ఈ హెరాయిన్​ ప్యాకెట్లను విసిరారని బీఎస్​ఎఫ్​ దళాలు తెలిపాయి.

బీఎస్​ఎఫ్​ దళాలు స్వాధీనం చేసుకున్న నాలుగు హెరాయిన్​ ప్యాకెట్లు

ఇవీ చదవండి:ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. డైరెక్టర్​ ఫ్యామిలీలో ముగ్గురు సజీవదహనం!

కుప్పకూలిన భారత ఆర్మీ చీతా హెలికాప్టర్- ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details