త్రిపుర నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా తరలిస్తున్న 1,058కేజీల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారులు బిహార్‌లో పట్టుకున్నారు. దీని విలువ రూ. కోటి 58 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయిని సరఫరా చేస్తోన్న ఇద్దరిని అరెస్టు చేశారు.
రూ.కోటిన్నర విలువగల గంజాయి పట్టివేత - గంజాయి పట్టివేత
బిహార్‌లో 1,058 కేజీల గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. రూ. కోటికిపైగా విలువగల గంజాయిని త్రిపుర నుంచి బిహార్‌లోని హాజీపుర్‌కు ట్రక్కులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

రూ.కోటిన్నర విలువగల గంజాయి పట్టివేత
ముజఫర్‌పుర్- దర్భంగా జాతీయ రహదారిపై గంజాయితో ఓ ట్రక్ వెళుతున్నట్లు డీఆర్ఐ అధికారులకు సమాచారం అందింది. దాంతో మైతీ టోల్ ప్లాజా దగ్గర బుధవారం తనీఖీలు నిర్వహించారు. ట్రక్కులో ఉన్న గంజాయిని పట్టుకున్నారు. త్రిపురలోని ఉదయ్‌పుర్ నుంచి గంజాయిని ట్రక్కులో బిహార్‌లోని హాజీపుర్ జిల్లాకు తరలించాలని నిందితులు అనుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి:'తుదిదశకు బలగాల ఉపసంహరణ ప్రక్రియ'