దేశంలోకి అక్రమంగా ఐఫోన్లను తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో నిర్వహించిన సోదాల్లో మొత్తం 3,646 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే సంబంధిత దిగుమతి పత్రాలలో మాత్రం వీటిని.. 'మెమరీ కార్డ్‌లు'గా పేర్కొన్నట్లు గుర్తించారు. హాంకాంగ్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
దాదాపు రూ.15 కోట్ల విలువ..
పట్టుబడిన వాటిల్లో మొత్తం 2,245 ఐఫోన్-13 ప్రో, 1,401 ఐఫోన్-13 ప్రో మ్యాక్స్ సహా.. 12 గూగుల్ పిక్సెల్ ప్రో6 ఫోన్లు, ఓ యాపిల్ స్మార్ట్ వాచ్ ఉన్నాయని తెలిపారు. వీటి విలువ మొత్తం రూ.42.86 కోట్లుగా ఉంటే.. దిగుమతి చేస్తున్న వస్తువుల విలువను కేవలం రూ.80 లక్షలుగా చూపించడం గమనార్హం.