తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మొన్నటి వరకు గ్యాస్ డెలివరీ బాయ్- ఇప్పుడు కోటీశ్వరుడు- డ్రీమ్‌ 11లో జాక్​పాట్ - డ్రీమ్​11 జాక్​పాట్ ఒకటిన్నర కోటి

Dream11 Jackpot Winner : ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో ఓ యువకుడు జాక్‌పాట్‌ కొట్టాడు. డ్రీమ్‌-11 యాప్‌లో ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. మిలియనీర్ కావాలనే తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశాడు.

Dream11 Jackpot Winner
Dream11 Jackpot Winner

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 1:45 PM IST

Dream11 Jackpot Winner : ఇంటింటికి గ్యాస్​ సరఫరా చేసే ఓ యువకుడు రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో జాక్‌పాట్‌ కొట్టాడు. రూ.49 పెట్టి డ్రీమ్​-11 యాప్‌లో గేమ్‌ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర గెలుచుకున్నాడు.

బిహార్​, అరారియా జిల్లా సదర్ మండలం పటేగనా గ్రామంలో సాదిక్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అతడు స్థానికంగా ఉండే ఉమా రాజ్​ గ్యాస్ ఏజెన్సీలో గ్యాస్ డిస్ట్రిబ్యూటర్​గా పనిచేస్తున్నాడు. క్రికెట్​పై ఆసక్తి ఉన్న సాదిక్ జనవరి 14న జరిగిన భారత్- అఫ్గానిస్థాన్​ మ్యాచ్‌లో రూ.49 పెట్టి డ్రీమ్​-11లో ఫాంటసీ గేమ్‌ ఆడాడు. ఈ మ్యాచ్​లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిక్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది.

డ్రీమ్​11లో రూ.కోటిన్నర గెలుచుకున్న సాదిక్

"ఈ విజయంతో మా కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా భారత్, అఫ్గానిస్థాన్​ మ్యాచ్​లో రూ.49తో గేమ్​ ఆడాను. మిలియనీర్​ కావాలనే నా కల కొన్ని గంటల్లోనే నెరవేరింది."
-- సాదిక్, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్

సాదిక్ అప్పుడప్పుడు చిన్న మొత్తాలను గెలుచుకునేవాడు. ఈసారి ఏకంగా డ్రీమ్​-11 గేమ్​ టాలీ బోర్డ్​లో తొలి స్థానం వచ్చిందని చెప్పాడు. కానీ ఈ విషయం చెబితే సాదిక్​ను ఎవరూ నమ్మలేదు. పుకారుగా కొట్టిపారేశారు. కానీ సాదిక్​ ఖాతాలోకి డబ్బు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో సాదిక్​ను అభినందించేందుకు బంధువులు అతడి ఇంటికి చేరుకుంటున్నారు.
మరోవైపు, ఈ విషయంపై సాదిక్​ పని చేసే ఉమా రాజ్ గ్యాస్​ ఏజెన్సీ డైరెక్టర్ జితేంద్ర కుమార్​ సింగ్ స్పందించారు. సాదిక్ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్​డ్​ డిపాజిట్ చేశామని తెలిపారు.

జాక్​పాట్ వరించింది- ఉద్యోగం ఊడింది!
గతేడాది అక్టోబర్​లో మహారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన ఎస్​ఐ సోమ్​నాథ్​ జెండే డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. దీంతో ఆయన కుటుంబంలో సంతోషంలో ముగిపోయింది. ఈ క్రమంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. సోమ్​నాథ్​ జెండేను ఉన్నతాధికారులు విధుల్లో నుంచి సస్పెండ్​ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటేఈ లింక్​పై క్లిక్ చేయండి.

డ్రీమ్​ 11లో రూ.కోటి జాక్​పాట్​.. ఫుల్లుగా మందుకొట్టి హల్​చల్​.. అఖరికి

డ్రీమ్ 11లో ఆటో డ్రైవర్​కు జాక్​పాట్​.. రూ.39తో కోటి సొంతం.. బ్యాంక్ అకౌంట్ లేక..

ABOUT THE AUTHOR

...view details