తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 11:00 PM IST

ETV Bharat / bharat

దేశీయ నిఘా వ్యవస్థకు 'సింధు నేత్ర'

డీఆర్​డీఓకు చెందిన యువశాస్త్రవేత్తలు తయారు చేసిన సింధు నేత్ర అనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరింది. పీఎస్​ఎల్​వీ సీ-51 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

DRDO's 'Sindhu Netra' surveillance satellite deployed in space, will help to monitor Indian Ocean Region
దేశీయ నిఘా వ్యవస్థకు 'సింధూనేత్ర'

వ్యూహాత్మకంగా కీలకమైన హిందూ మహా సముద్రం ప్రాంతంపై నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు డీఆర్​డీఓ అభివృద్ధి చేసిన సింధు నేత్ర ఉపగ్రహం కక్ష్యలోకి చేరింది. పీఎస్​ఎల్​వీ సీ-51 వాహకనౌక ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. డీఆర్​డీఓకు చెందిన యువశాస్త్రవేత్తలు తయారు చేసిన సింధు నేత్ర హిందూ మహా సముద్రంలోని యుద్ధనౌకలు, వాణిజ్యనౌకల కదలికలను గుర్తించనుంది.

ఈ ఉపగ్రహం భూ వ్యవస్థలతో కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో నిఘాన మరింత బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడనున్నట్లు వివరించాయి. అవసరమైతే ఈ ఉపగ్రహం దక్షిణ చైనా సముద్రం, ఆఫ్రికా తీరం సహా పలు ప్రాంతాలపై నిఘా ఉంచుతుందని స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి: పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

ABOUT THE AUTHOR

...view details