రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ)లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని రక్షణ శాఖపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి నివేదించింది. ప్రస్తుతం ఆమోదించిన ప్రాజెక్టులను పూర్తి చేయటానికి మానవ వనరుల సంఖ్య పెంచాలని రక్షణశాఖకు కమిటి సూచించింది.
"డీఆర్‌డీఓలో ఎక్కువ మంది శాస్త్రవేత్తలు అవసరం. పూర్తి సామర్థ్యంలో శాస్త్రవేత్తలు 30శాతం ఉంటారు. కానీ ఆమోదించిన ప్రాజెక్ట్‌లకు సరిపడా శాస్త్రవేత్తలు లేరు. 7,353 మందిలో ప్రస్తుతం 7,068మంది మాత్రమే ఉన్నారు. "
-- పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి రిపోర్ట్
డీఆర్‌డీఓలో రెండు సీనియర్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ కమిటి ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) నుంచి ఆమోదం పొందాలని ఆర్థిక శాఖ.. రక్షణశాఖకు ఇది వరకే సూచించిందని ఈ రిపోర్టు గుర్తుచేసింది.