తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Brahmos Missile: బ్రహ్మోస్ 'ఎయిర్​ వెర్షన్' ప్రయోగం సక్సెస్

Brahmos Air Version Test: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి 'ఎయిర్ వెర్షన్‌'ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్ సమీకృత ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగినట్లు భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్‌డీఓ) వర్గాలు తెలిపాయి.

air version of brahmos
బ్రహ్మోస్

By

Published : Dec 8, 2021, 4:07 PM IST

Brahmos Missile Air Version Test: భారతదేశపు అత్యున్నత క్షిపణి వ్యవస్థల్లో ఒకటైన బ్రహ్మోస్.. మరో మైలురాయిని అధిగమించింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి సిరీస్​లో ముఖ్యమైన ఎయిర్ వెర్షన్‌ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది.

Brahmos Supersonic Cruise Missile: దీనిని సూపర్‌సోనిక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సుఖోయ్-30 ఎంకే-1 నుంచి బుధవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించగా.. నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో చేరుకున్నట్లు వెల్లడించింది డీఆర్​డీఓ. ఎయిర్ వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణుల ఉత్పత్తికి ఈ ప్రయోగం దోహదపడుతుందని ప్రకటించింది.

విమానం నుంచి జారవిడుస్తున్న బ్రహ్మోస్ మిస్సైల్

Rajnath Singh DRDO: మిషన్ విజయవంతం అయిన నేపథ్యంలో.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్​డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులను ప్రశంసించారు.

ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్తలను డీఆర్​డీఓ ఛైర్మన్ డాక్టర్ జీ. సతీశ్ రెడ్డి అభినందించారు.

బ్రహ్మోస్ అనేది సూపర్​సోనిక్ క్రూయిజ్ క్షిపణి. భారత్-రష్యా సంయుక్తంగా దీన్ని అభివృద్ధి, ఉత్పత్తి, మార్కెటింగ్ చేసేలా ఒప్పందం కుదిరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details