తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాక్​కు రహస్యాల చేరవేత.. DRDO సైంటిస్ట్ అరెస్ట్.. 6నెలల్లో రిటైర్మెంట్ ఉండగా..

పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సంప్రదింపులు సాగిస్తున్న డీఆర్​డీఓకు చెందిన శాస్త్రవేత్తను మహారాష్ట్ర ఏటీఎస్ అరెస్ట్ చేసింది. అధికారిక రహస్యాల చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

DRDO scientist pakistan espionage
DRDO scientist pakistan espionage

By

Published : May 4, 2023, 9:25 PM IST

Updated : May 4, 2023, 10:33 PM IST

పాకిస్థాన్​కు కీలక రహస్యాలు చేరవేస్తున్న డీఆర్​డీఓ శాస్త్రవేత్తను మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. పాకిస్థాన్​కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వర్గాలతో నిందితుడు కాంటాక్ట్​లో ఉన్నాడని గుర్తించినట్లు ఏటీఎస్ తెలిపింది. వాట్సాప్​ మెసేజ్​లు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్​ ద్వారా అతడు వారితో సంప్రదింపులు జరుపుతున్నాడని వెల్లడించింది. నిందితుడు హనీట్రాప్​లో పడ్డట్లు ఏటీఎస్ తెలిపింది. గత ఆరు నెలలుగా ఓ మహిళతో అతడు సన్నిహితంగా ఉంటున్నట్లు గుర్తించింది.

నిందితుడిని ప్రదీప్ కురుల్కర్​గా గుర్తించారు అధికారులు. పుణెలోని డీఆర్​డీఓ విభాగంలో నిందితుడు పనిచేస్తున్నాడని ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉండి తన హోదాను దుర్వినియోగం చేశాడని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రహస్యాల విషయంలో అతడు రాజీ పడ్డాడని తెలిపారు. ఈ రహస్య సమాచారం.. ప్రత్యర్థి దేశానికి చిక్కితే భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని వెల్లడించారు. నిందితుడు మరో ఆరు నెలల్లో రిటైర్ కానున్నట్లు సమాచారం. ఈలోగా ప్రత్యర్థి దేశం వలలో చిక్కుకోవడం గమనార్హం.

అరెస్ట్ అయిన సైంటిస్ట్

"నిందితుడు సీనియర్ హోదాలో ఉన్నాడు. దేశంలోని అత్యంత ఉన్నతమైన రక్షణ రంగ పరిశోధనలో పనిచేస్తున్నాడు. అతడు తన హోదాను దుర్వినియోగం చేశాడు. తనకు తెలిసిన రహస్యాలు ప్రత్యర్థి దేశాలకు చిక్కితే ప్రమాదం అని తెలిసినా.. ఈ పని చేశాడు. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ (పీఐఓ) ఏజెంట్​తో అతడు కాంటాక్ట్​లో ఉన్నాడు. వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా సంభాషించాడు. కీలకమైన సమాచారాన్ని ఆ ఏజెంట్​తో పంచుకున్నాడు. ఇది హనీట్రాప్ కేసు."
-ఏటీఎస్ అధికారులు

దీనిపై ముంబయి, కాలాచౌకీకి చెందిన ఏటీఎస్ విభాగం కేసు నమోదు చేసిందని అధికారులు వివరించారు. 1923 అధికారిక రహస్యాల చట్టంలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.

ఇటీవల బిహార్​లో ఇదే తరహా హనీట్రాప్​ ఘటన వెలుగుచూసింది. ముజఫర్​పుర్​ జిల్లా కాట్రా రిజిస్ట్రార్ కార్యాలయంలో క్లర్క్​గా పనిచేస్తున్న రవి చౌరాసియా అనే వ్యక్తి దేశానికి సంబంధించిన రహస్య పత్రాలను పాకిస్థాన్​కు చెందిన గూఢాచారి సంస్థ ఐఎస్​ఐకు లీక్​ చేశాడనే ఆరోపణలతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. జాతీయ భద్రతా సంస్థ ఆదేశాల మేరకు క్లర్క్​ను అరెస్టు చేసినట్లు ముజఫర్​పుర్​ సీనియర్​ ఎస్​పీ జయంత్ కాంత్​ తెలిపారు. నిందితుడు.. ముంగర్​ జిల్లాకు చెందిన వ్యక్తి అని ఆయన తెలిపారు. పాకిస్థాన్​కు చెందిన ఐఎస్​ఐ గూఢాచారి సంస్థకు పనిచేసే ఓ మహిళా ఏజెంట్​.. నిందితుడిని ఫేస్​బుక్​ ద్వారా పరిచయం చేసుకుంది. అంతకుముందు నిందితుడు చెన్నై ఆవడీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్​గా పనిచేసేవాడు. అక్కడి నుంచి కూడా రహస్య సమాచారాన్ని గూఢాచారులకు పంపేవాడని తేలింది. ఈ వార్త పూర్తి వివరాల కోసం లింక్​పై క్లిక్ చేయండి.

Last Updated : May 4, 2023, 10:33 PM IST

ABOUT THE AUTHOR

...view details