తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాత పరీక్ష లేదు.. నేరుగా ఇంటర్వ్యూ.. జాబ్ వస్తే నెలకు రూ.54వేలు జీతం - డీఆర్​డీఓ జాబ్స్​

DRDO Jobs: రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది డీఆర్​డీఓ. ఆసక్తిగల అభ్యర్థులు నేరుగా హాజరుకావచ్చు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

drdo-recruitment
డీఆర్​డీఓ ఉద్యోగాలు

By

Published : May 25, 2022, 11:24 AM IST

Job News: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO).. రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపికైన వారు రెండేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. రాజస్థాన్ జోధ్​పుర్​లోని డీఆర్​డీఓ ల్యాబ్​లో జూన్​ 13, 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం..

  • మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
  • నెల జీతం రూ.54,000
  • వయసు 35 ఏళ్లకు మించకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడేళ్ల వరకు వయోపరిమితి ఉంటుంది.
  • పీహెచ్​డీ లేదా కెమిస్ట్రీ, ఫిజిక్స్​, మెటీరియల్ సైన్స్​లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా మూడేళ్ల రీసెర్చ్, టీచింగ్, డిజైనింగ్​ అనుభవం ఉండాలి
    డీఆర్​డీఓ ఉద్యోగాలు
  • అర్హులైనవారు జోధ్​పుర్​ రాతానాడాలోని డీఆర్​డీఓ పరీక్ష కేంద్రంలో పైన పేర్కొన్న తేదీల్లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హజరవ్వాలి.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్​ సర్టిఫికెట్స్, ఫొటో తీసుకువెళ్లాలి.
  • ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల కోసం https://www.drdo.gov.in/ వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వండి.

ABOUT THE AUTHOR

...view details