DRDO Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్‌డీఓకాంట్రక్ట్ ప్రాతిపదికన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో కలిపి నాలుగు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF) స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు మొదటి రెండు సంవత్సరాలు జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF)గా పని చేస్తారు.
DRDO JRF Recruitment 2023 Notification : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ.37000, ప్లస్ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. దరఖాస్తుదారులను గేట్ స్కోర్‌లో చూపిన ప్రతిభ, వారి కనీస అర్హత డిగ్రీలలో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఇంటర్వ్యూ సమయంలో, అభ్యర్థులు తగిన అన్ని పత్రాలనూ సమర్పించాలి.
DRDO JRF Recruitment : ఉద్యోగాల వివరాలు
- ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఫిజిక్స్‌లో జూనియర్ రీసెర్చ్ ఫెలో రెండు కలిపి 04 (JRF) స్థానాలు.
విద్యార్హతలు
- జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం (ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) :
- నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో BE/BTech మొదటి శ్రేణిలో పాస్ అయి, NET/GATE ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
- అభ్యర్థులు M.E/M.Tech ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి.. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
- జూనియర్ రీసెర్చ్ ఫెలో కోసం (ఫిజిక్స్‌లో)
- అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫిజిక్స్‌లో మొదటి శ్రేణిలో M.E./M.Tech/B.Tech/B.E పాస్ అయి, NET/GATE ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
- అభ్యర్థులు M.E/M.Tech ఫిజిక్స్ విభాగంలో పూర్తి చేసి ఉండాలి.
- యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
- అభ్యర్థులు గేట్ స్కోర్‌లో చూపిన ప్రతిభ, అకాడమిక్ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు.