తెలంగాణ

telangana

ETV Bharat / bharat

DRDO Jobs 2023 : ఇంజినీరింగ్ అర్హతతో.. డీఆర్​డీఓలో ఐటీఆర్​, సైంటిస్ట్-బి ఉద్యోగాలు.. అప్లైకు మరో 2 రోజులే ఛాన్స్! - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2023

DRDO Jobs 2023 In Telugu : ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. డిఫెన్స్ రీసెర్చ్​ అండ్ డెవలప్​మెంట్​ ఆర్గనైజేషన్​ (DRDO) 258 ఐటీఆర్​, సైంటిస్ట్​-బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం..

DRDO Recruitment 2023 For 258 ITR and Scientist B Vacancies
DRDO Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2023, 10:39 AM IST

DRDO Jobs 2023 : కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్​డీఓ 258 ఐటీఆర్​, సైంటిస్ట్-బి పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు
DRDO ITR Jobs 2023 :

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 30
టెక్నీషియన్ అప్రెంటీస్ 24​
మొత్తం ఐటీఆర్​ పోస్టులు 54

DRDO Scientist Jobs 2023 :

సైంటిస్ట్-బి (డీఆర్​డీఓ) 181 పోస్టులు
సైంటిస్ట్​-బి (డీఎస్​టీ) 11 పోస్టులు
సైంటిస్ట్​/ ఇంజినీర్​-బి (ఏడీఏ) 06 పోస్టులు
సైంటిస్ట్-బి (సీఎంఈ) 06 పోస్టులు
మొత్తం సైంటిస్ట్-బి పోస్టులు 204

విద్యార్హతలు

  • ఐటీఆర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కచ్చితంగా.. ఆయా పోస్టులకు అనుగుణంగా బీఈ/ బీటెక్​/ బీబీఏ/ బీకాం/ B.Lib.Sc/ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • సైంటిస్ట్​-బి ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కచ్చితంగా.. ఆయా పోస్టులకు అనుగుణంగా బీఈ/ బీటెక్​ ప్రథమ శ్రేణిలో (ఫస్ట్ క్లాస్​) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలీడ్​ గేట్ స్కోర్​ కూడా ఉండాలి.

వయోపరిమితి

  • ఐటీఆర్​ ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 28 సంవత్సరాలు.
  • సైంటిస్ట్​-బి ఉద్యోగాల ఏజ్ లిమిట్​ విషయానికి వస్తే.. కొన్ని పోస్టులకు 30 సంవత్సరాలు, మరికొన్ని పోస్టులకు 35 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిగా ఉంది.

అప్లికేషన్ ఫీజు

  • ఐటీఆర్, సైంటిస్ట్​-బి పోస్టులకు.. జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, మహిళ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
DRDO Job Selection Process :

  • అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, అందులో ఉత్తీర్ణులైన వారిని డీఆర్​డీఓ ఐటీఆర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • పర్సనల్ ఇంటర్వ్యూ, గేట్ స్కోర్ అధారంగా.. సైంటిస్ట్-బి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
DRDO Salary :

  • డీఆర్​డీఓ ఐటీఆర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000 చొప్పున జీతం అందిస్తారు.
  • సైంటిస్ట్-బి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు.. పే లెవల్​ -10 ప్రకారం, నెలవారీగా రూ.56,100 నుంచి రూ.1,00,000 వరకు జీతం అందిస్తారు.

ముఖ్యమైన తేదీలు
DRDO Scientist B Application Last Date :

  • డీఆర్​డీఓ ఐటీఆర్​ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 6
  • డీఆర్​డీఓ సైంటిస్​ బి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 2023 సెప్టెంబర్​ 29

ఆసక్తి గల అభ్యర్థులు డీఆర్​డీఓ అధికారిక వెబ్​సైట్​ https://www.drdo.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Employment News September 2023 : నిరుద్యోగ యువతకు గుడ్​ న్యూస్​.. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు!.. గిగ్​ జాబ్స్ కూడా!

IFFCO Recruitment 2023 Notification : 'ఇఫ్​కో'లో ఉద్యోగాలు.. రూ.వేలల్లో వేతనం.. కరూర్​ వైశ్య బ్యాంక్​లో ఖాళీలు

ABOUT THE AUTHOR

...view details