కొవిడ్-19 బాధితులు, అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల కోసం అనుబంధ ఆక్సిజన్ బట్వాడా వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) సోమవారం ప్రకటించింది. ఇది ఆటోమెటిక్ వ్యవస్థ అని, శరీరంలో 'బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్(ఎస్సీఓ2)' స్థాయి ఆధారంగా అనుబంధ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని తెలిపింది.
కరోనా బాధితుల కోసం కొత్త ఆక్సిజన్ వ్యవస్థ - డీఆర్డీఓ
కరోనా బాధితుల కోసం అనుబంధ ఆక్సిజన్ బట్వాడా వ్యవస్థను అభివృద్ధి చేసింది రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ). శరీరంలో 'బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్(ఎస్సీఓ2)' స్థాయి ఆధారంగా అనుబంధ ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని తెలిపింది. ఇది ఆటోమెటిక్ వ్యవస్థ అని పేర్కొంది.
బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్
తద్వారా బాధితుల హైపోక్సియా అనే ప్రాణాంతక స్థితిలోకి జారిపోయే ప్రమాదాన్ని నివారిస్తుందని డీఆర్డీఓ పేర్కొంది. కొవిడ్ బాధితుల్లో ఈ సమస్య తలెత్తుతుంటుంది. తాము రూపొందించిన సాధనం ఖరీదు తక్కువేనని డీఆర్డీఓ తెలిపింది. వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడం కోసం సంబంధిత పరిజ్ఞానాన్ని పరిశ్రమలకు బదిలీ చేసినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి:కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా