డీఆర్డీఓలో పని చేయాలనుకునే వారికి శుభవార్త. 150 పోస్టులకు గానూ డీఆర్డీఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ట్రైనీల కోసం దరఖాస్తులు కోరింది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ బెంగళూరు అప్రెంటిస్ ట్రైనీల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు గ్రాడుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీస్, ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీస్ ఇలా వివిధ విభాగాలలో ఉన్న ఖాళీలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పై విభాగాలలో 150 పోస్టులకు గానూ దరఖాస్తులను కోరుతోంది. డీఆర్డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ప్రతినెల రూ.9000 స్టైఫండ్గా పొందుతారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులు బెంగళూరులో పని చేయాల్సి ఉంటుంది.
డీఆర్డీఓ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు వారి అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికవుతారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను డీఆర్డీఓ అధికారిక వెబ్సైట్లో పొందుపరుచుతారు. ఉద్యోగ అప్డేట్లకోసం అభ్యర్థులు ప్రతిరోజు వెబ్సైట్ను చెక్ చేస్తుండాలి.
ఖాళీల వివరాలు
- మొత్తం ఖాళీలు: 150
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు- ఇంజినీరింగ్ (బీఈ, బీటెక్): 75 ఖాళీలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీలు- నాన్ ఇంజినీరింగ్ (బీకాం/ బీఎస్సీ/ బీఏ/ బీసీఏ, బీబీఏ): 30 ఖాళీలు
- డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీలు: 20 ఖాళీలు
- ఐటీఐ అప్రెంటిస్ ట్రైనీలు: 25 ఖాళీలు