President Draupadi Murmu Visit to Hyderabad Today : విప్లవ వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు విచ్చేశారు. బెంగళూరు నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతికి..గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం.. ద్రౌపదిముర్ము అక్కడి నుంచి రోడ్డు మార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. రాష్ట్రపతి నిలయం పరిశీలన, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ద్రౌపది ముర్ము హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియం బయల్దేరి వెళ్తారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటల నుంచి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకొని.. అక్కడి నుంచి భారత వాయుసేన విమానంలో సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము నాగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు.
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఇదే..
- బెంగళూరు నుంచి భారత వాయుసేన విమానంలో ఉదయం 10 గంటలకు హకీంపేట విమానాశ్రయం చేరుకుంటారు.
- అక్కడి నుంచి రోడ్డుమార్గాన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.
- రాష్ట్రపతి నిలయం పరిశీలన, భోజనం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు.
- సాయంత్రం నాలుగు గంటల నుంచి అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
- ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొంటారు.
- కార్యక్రమం అనంతరం సాయంత్రం హెలికాప్టర్‌లో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుంటారు.
- సాయంత్రం ఆరు గంటలకు భారత వాయుసేన విమానంలో నాగపూర్ బయల్దేరి వెళ్తారు.