దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వస్తోన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటివరకు పిల్లలపై ప్రభావం చూపేంతగా వైరస్‌లో మార్పులు కనిపించలేదని స్పష్టం చేసింది. అయితే, వైరస్ ప్రవర్తనలో మార్పులు వస్తే మాత్రం చిన్నారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నామని తెలిపింది.
'చిన్నారుల్లో వైరస్ సంక్రమణపై ఇప్పటికే దృష్టి పెట్టాము. సాధారణంగా పిల్లలకు వైరస్ సోకితే లక్షణాలు కనిపించవు. ఇన్‌ఫెక్షన్ సోకినా లక్షణాలు తక్కువగా ఉంటాయి. ఒక్కోసారి అసలే కనిపించవు. ఇప్పటివరకు పిల్లల్లో వైరస్ సంక్రమణ తీవ్రత ప్రమాదకరంగా ఏమీ లేదు' అని నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు. అయితే, ఒక్కోసారి వైరస్ స్వభావంలో మార్పులు సంభవిస్తే.. పిల్లలపై దాని ప్రభావం ఎక్కువగానే ఉంటుందన్నారు. అయినప్పటికీ ఇన్‌ఫెక్షన్ తక్కువగానే ఉంటుందని.. కేవలం 2 నుంచి 3శాతం చిన్నారులకు మాత్రమే ఆసుపత్రిలో చేరిక అవసరం ఏర్పడవచ్చని అంచనా వేశారు. అందుకే అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత అవుతున్నామని.. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటుచేశామని వీకే పాల్ స్పష్టం చేశారు.
రెండు విధాలుగా గుర్తింపు..