కాలిన గాయాలతో బాధపడే రోగులకు ఉపయోగపడే ఒక రకమైన పదార్థాన్ని అభివృద్ధి చేశారు మొహలీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ పరీక్షిత్ బన్సల్. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో తయారైన మొట్టమొదటి ఆవిష్కరణగా దీనిని పేర్కొన్నారు. ఈ డ్రెస్సింగ్తో కాలిన గాయాలకు చికిత్స అందించొచ్చని స్పష్టం చేశారు.
కాలిన గాయాల చికిత్సకు సరికొత్త ఆవిష్కరణ! - సెల్యులోసిక్ పొరతో చికిత్స
శరీరంపై కాలిన గాయాలైతే ఆ బాధ వర్ణనాతీతం. గాయాల మంటతో విలవిల్లాడుతున్న రోగికి చికిత్స అందించడం సైతం అత్యంత సవాలుతో కూడుకున్న పని. అయితే సులువైన పద్ధతిలో కాలిన గాయాలకు చికిత్స అందించే పదార్థాన్ని రూపొందించారు మొహలీకి చెందిన పరీక్షిత్ బన్సల్ అనే శాస్త్రవేత్త.
కాలిన గాయాలకు చికిత్స పదార్థం
సెల్యులోసిక్ పొరతో కూడిన ఈ డ్రెస్సింగ్ వ్యాధులు సంక్రమించకుండా, బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. కాలిన గాయాలతో బాధపడే రోగులకు చర్మం మంట నుంచి ఉపశమనం లభిస్తుందని వివరించారు.
ఇదీ చదవండి:ఒక్కరోజే 2 లక్షల 61 వేల కేసులు- 1500 మరణాలు