తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబేడ్కర్​కు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

Ambedkar death anniversary: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బీఆర్​​ అంబేడ్కర్​ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా ఇతర పార్లమెంటు సభ్యులు ఆయనకు నివాళులు అర్పించారు. పార్లమెంటు ప్రాంగణంలోని అంబేడ్కర్​ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్​ వేదికంగా అంబేడ్కర్​కు నివాళి అర్పించారు.

Ambedkar death anniversary
అంబేడ్కర్ వర్ధంతి

By

Published : Dec 6, 2021, 10:33 AM IST

Updated : Dec 6, 2021, 12:24 PM IST

Ambedkar death anniversary: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బీఆర్​​ అంబేడ్కర్​ 65వ వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నివాళులు అర్పించారు. పార్లమెంటు ప్రాంగణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద పూలు జల్లి, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

అంబేడ్కర్​కు నివాళి అర్పిస్తున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​
అంబేడ్కర్​కు నివాళి అర్పిస్తున్న మోదీ

లోక్​సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర పార్లమెంటు సభ్యులు కూడా అంబేడ్కర్​కు నివాళులు అర్పించారు.

అంబేడ్కర్​కు నివాళి అర్పిస్తున్న నేతలు
పార్లమెంటు ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం

'చేయాల్సింది చాలా ఉంది'

అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ప్రస్తుతం దేశంలోని పరిణామాలను చూస్తోంటే.. అంబేడ్కర్ కలలు ఇంకా నెరవేరలేదనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

"దేశంలో సామాజిక అన్యాయం, హింస, వివక్ష చూస్తున్నప్పుడు... బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలు నెరవేరాలంటే చేయాల్సింది ఇంకా చాలా ఉందని నేను భావిస్తాను. కానీ, మనం తప్పకుండా దాన్ని సాధిస్తాం. ఆయనకు నా నివాళులు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

'వారికి దక్కట్లేదు..'

అంబేడ్కర్​కు బహుజన సమాజ్​ పార్టీ(బీఎస్​పీ) అధినేత్రి మాయావతి నివాళులు అర్పించారు. "అణగారిన ప్రజలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి అంబేడ్కర్​ ఎంతో కృషి చేశారు. రాజ్యాంగం ద్వారా అంబేడ్కర్ ఆయా వర్గాల వారికి అందించిన ప్రయోజనాలు... ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న కులతత్వ ప్రభుత్వాల కారణంగా వారికి దక్కట్లేదు" అని ఆమె ఆరోపించారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ 1891 ఏప్రిల్​ 14న జన్మించారు. భారత రాజ్యాంగ రచనలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1956 డిసెంబరు 6న కన్నుమూశారు. 1990లో అంబేడ్కర్​ను భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'తో ఆనాటి ప్రభుత్వం సత్కరించింది.

అంబేడ్కర్ వర్ధంతిని 'మహాపరినిర్వాణ్ దివస్'​గా నిర్వహించుకుంటారు.

Tags: br amedkar death anniversary, pm modi tributes to ambedkar, president tributes to ambedkar, Mahaparinirvan Diwas

ఇదీ చూడండి:రాజీనామా చేస్తా అంటే మోదీ వద్దన్నారు: దేవెగౌడ

ఇదీ చూడండి:'దేశాభివృద్ధికి వారిని జవాబుదారీగా చేయాలి'

Last Updated : Dec 6, 2021, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details