తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో ఉద్రిక్త పరిస్థితులు.. అమిత్​ షా, డోభాల్​ అత్యవసర భేటీ - కశ్మీర్​ కిల్లింగ్స్​

Amit Shah Meeting:గత కొద్దిరోజులుగా కశ్మీర్​లో ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. ఉన్నతాధికారులతో గురువారం భేటీ అయ్యారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, 'రా' చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులతో సమావేశమయ్యారు. ఆ వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్‌ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

amtihshah
amtihshah

By

Published : Jun 3, 2022, 6:41 AM IST

Amit Shah Meeting: కశ్మీర్‌లో గురువారం బ్యాంకు మేనేజర్‌ విజయకుమార్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ డోభాల్‌, 'రా' చీఫ్‌ సామంత్‌ గోయల్‌ తదితరులు పాల్గొన్న ఈ భేటీలో గత మే నెల నుంచి వరుసగా లక్షిత హత్యలు జరుగుతున్న జమ్ముకశ్మీర్‌ శాంతిభద్రతలపై చర్చించారు.

వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం జరగాల్సిన ఈ సమావేశం కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన తాజా హత్యతో ఒకరోజు ముందే నిర్వహించారు. నార్త్‌బ్లాకులోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం గంటకు పైగా వీరి మధ్య కీలక చర్చలు జరిగాయి. సమావేశం వివరాలు బయటకు తెలియకపోయినా కశ్మీర్‌ పరిస్థితులపైనే మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు శుక్రవారం నాటి సమావేశంలోనూ కొనసాగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details