రాజస్థాన్ బాడ్మేర్ పోలీసులు ఇటీవల చేసిన ఎన్కౌంటర్ వివాదాస్పదమైంది. యాక్సిడెంట్ చేసి పరారైన కేసులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అయింది. అయితే.. ఈ ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ జరిగింది..
ఏప్రిల్ 22న రాత్రి 9-10 గంటల మధ్య బాడ్మేర్ పోలీసులు.. కమలేశ్ ప్రజాపతి అనే వ్యక్తిని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో నిందితుడు మృతి చెందాడు. తమను తాము రక్షించుకునేందుకే ఈ ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కానీ, ఎన్కౌంటర్ జరిగిన సమయంలో పోలీసులు కమలేశ్ ప్రజాపతి ఇంటిని చుట్టుముట్టినట్లు వైరల్ అయిన వీడియోలో స్పష్టంగా కనిసిస్తోంది.