బంగారం అక్రమ రవాణా చేస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తి పట్ల కస్టమ్స్ అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహమే వారిపై కేసు నమోదయ్యేలా చేసింది. చేతి గడియారంలో బంగారం ఉందనే అనుమానంతో దానిని విచ్ఛిన్నం చేసి.. విడిబాగాలను అతని చేతిలో పెట్టారు. చివరకు దాని విలువ తెలుసుకొని అవాక్కయ్యారు.
ఇదీ జరిగింది..
కర్ణాటకలోని భట్కల్‌కు చెందిన మొహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దుబాయ్‌లోని తన సోదరుడిని కలిసేందుకు వెళ్లాడు. సొంతూరుకు తిరిగివచ్చే క్రమంలో మార్చి 3న కేరళలోని కాలికట్ విమానాశ్రయంలో దిగాడు. బంగారం స్మగ్లింగ్‌పై తనిఖీలు చేస్తున్న అక్కడి కస్టమ్స్ అంధికారులు.. ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని చేతికి ఉన్న గడియారంలో బంగారం ఉందనే నెపంతో దానిని తీసుకొని పగలగొట్టారు. అందులో ఎలాంటి పసిడి పదార్థం లేదని తెలుసుకుని.. మళ్లీ బిగించకుండానే తిరిగి ఇచ్చారు.