తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాంక్ మేనేజర్ భార్య, కుమారుడి దారుణ హత్య, బెడ్ బాక్సుల్లో శవాలు - ఉత్తర్​ప్రదేశ్​లో​ జంట హత్యలు

జంట హత్యలు ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​లో కలకలం రేపాయి. బ్యాంక్ మేనేజర్ భార్య, వారి 5 ఏళ్ల కుమారుడ్ని దుండగులు దారుణంగా చంపి, మంచాల కింద ఉన్న పెట్టెల్లో దాచారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.

murder
జంట హత్యలు

By

Published : Aug 30, 2022, 1:55 PM IST

Double murder in Meerut : ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ జిల్లాలో తల్లీకొడుకులు హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. హస్తినాపుర్​లోని రామ్​లీలా గ్రౌండ్​ కాలనీకి చెందిన ఓ బ్యాంకు మేనేజర్​ భార్య, కుమారుడిని.. దొంగతనానికి వచ్చిన వారే గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఇంటి మెయిన్​ గేటుకు తాళం వేసి దుండగులు పరారయ్యారని తెలిపారు. కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఇంటి తాళం పగలగొట్టి చూడగా.. డబుల్ బెడ్ బాక్స్‌లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర్​ప్రదేశ్​ హస్తినాపుర్‌కు చెందిన సందీప్‌ కుమార్‌ బిజ్​నోర్​లోని ఓ​ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలానే సోమవారం ఉదయం సందీప్ బ్యాంకుకు వెళ్లాడు. అతని భార్య శిఖా, ఐదేళ్ల కుమారుడు రుద్రాంశ్ ఇంట్లోనే ఉన్నారు. రాత్రి 8 గంటలకు సందీప్​ ఇంటికి వచ్చి చూడగా మెయిన్​ గేటుకు తాళం వేసి ఉంది. బయట స్కూటీ కనిపించలేదు. భార్య ఫోన్‌కు కాల్‌ చేసినా ఎటువంటి స్పందన లేనందున.. సందీప్ తనకు తెలిసిన వాళ్ల ఇంటికి వెళ్లాడు. రాత్రి 10 గంటల వరకు శిఖా నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల.. కుటుంబ సభ్యులతో కలిసి సందీప్ గేటు తాళం పగలగొట్టాడు. ఇంటి లోపల చూసే సరికి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. శిఖా మృతదేహం ఒక గదిలోని బెడ్​ కింద భాగంలో ఉన్న పెట్టెలో, రుద్రాంశ్ మృతదేహం మరో గదిలోని బెడ్​ బాక్స్​లో కనిపించాయి.

కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం అందించారు. ఎస్​ఎస్​పీ రోహిత్​ సింగ్​ సజ్వాన్​, ఎస్​పీ కేశవ్ కుమార్​, పోలీసు సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దొంగతనానికి వచ్చిన వారే ఈ హత్యలు చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వారే మెయిన్​ గేట్​కు తాళం వేసి, స్కూటీపై పారిపోయినట్లు భావిస్తున్నారు. అదే సమయంలో.. మృతురాలి ఫోన్​లోని వాట్సాప్​లో కొన్ని మెసేజ్​లు డిలీట్​ చేసి ఉండడాన్ని పోలీసులు గమనించారు. వాటితో పాటు కొన్ని ఆధారాలు దొరికాయని ఎస్​పీ కేశవ్ కుమార్ తెలిపారు. దొరికిన ఆధారాల అనుగుణంగా హంతకులు పరిచయస్తులేనని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలోనే ఈ హత్యకు సంబంధించిన అన్ని విషయాలను బయటపెడతామన్నారు.

ఇవీ చదవండి : కుమార్తెపై తండ్రి అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక, బెయిల్​పై వచ్చి మరోసారి రేప్

బలవంతంగా బీఫ్ తినిపించిన భార్య, మనస్తాపంతో భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details