తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్.. ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్

Faridkot jail news: పంజాబ్.. మాదకద్రవ్యాల అడ్డాగా మారుతోంది. తాజాగా ఫరీద్​కోట్​లోని జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్టులు చేయగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. మహిళా ఖైదీలలో కొందరు సైతం మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు పరీక్షల్లో బయటపడింది.

faridkot jail news
ఫరీద్​కోట్​ జైలు

By

Published : Aug 6, 2022, 10:51 AM IST

Faridkot jail news: పంజాబ్‌లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్లకు సరఫరా అవుతున్నాయి. ఫరీద్‌కోట్‌ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్ట్​లు నిర్వహించగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్లు తేలింది. పంజాబ్‌ జైళ్లలో ఖైదీలకు మాదక ద్రవ్యాల సరఫరా నిరాటంకంగా సాగుతోందని చాలా రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో జైళ్లలో డోప్‌ టెస్ట్​లు నిర్వహించాలని పంజాబ్‌ సర్కార్ ఆదేశించింది.

ఫరీద్​కోట్​ జైలు

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫరీద్​కోట్ జైలులో ఖైదీలకు గతవారం డోప్ టెస్ట్​లు చేశారు. ఆ ఫలితాల్లో 2,333 మంది ఖైదీల్లో 1,064 మంది డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఫరీద్​కోట్ జైలులో 155 మంది మహిళా ఖైదీలు ఉండగా.. వారిలోనూ కొందరు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. ఖైదీల్లో డ్రగ్స్‌ వినియోగం మాన్పించేందుకు పంజాబ్‌ సర్కార్‌ ఎప్పటి నుంచో జైళ్లలో ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. ఇంతమంది ఖైదీలు.. మాదక ద్రవ్యాలు వాడుతున్నప్పుడు ఆ కేంద్రం ఉపయోగమేమిటనే విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. తాజా పరీక్షల్లో దొరికినవారిని కూడా డ్రగ్స్‌ మాన్పించే కేంద్రంలో చికిత్స అందిస్తామని సివిల్‌ సర్జన్‌ డాక్టర్ సంజయ్ కపూర్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details