కరోనా నేపథ్యంలో దిల్లీలో ఇంటి వద్దకే రేషన్ సరకుల కార్యక్రమాన్ని కేంద్రం ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు ఆ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజల ప్రయోజనార్థం ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకుంటే రేషన్ దుకాణాలు.. కరోనా వ్యాప్తికి హాట్స్పాట్లుగా మారుతాయని హెచ్చరించారు.
పిజ్జాలు, బర్గర్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, దుస్తులు ఇంటి వద్దకే వచ్చి అందిస్తుండగా.. రేషన్ సరకులు ఎందుకు అందించకూడదని ప్రశ్నించారు కేజ్రీవాల్. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి తమకు కేంద్రం అనుమతి అవసరం లేదని, అయినా ఎలాంటి వివాదం రాకుండా ఉండేదుకు, కేంద్రానికి అయిదు సార్లు అభ్యర్థించామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.