బంగాల్ కేబినెట్ మంత్రి పదవిని వీడిన సువేందు అధికారితో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ తెలిపారు. సువేందు అసమ్మతి పట్ల ఆయనతో పార్టీ అధినాయకత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. త్వరలో జరిగే ఆ చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
" సువేందుతో చర్చించడానికి మేమింకా సిద్ధంగానే ఉన్నాం. పార్టీ నాయకత్వానికీ, ఆయనకు మధ్య చర్చలు తప్పక జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. సువేందు తల్లి అనారోగ్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడేందుకు ఇంకా కొంచెం ఎదురు చూడాల్సి ఉంటుంది."
-- సౌగతా రాయ్, తృణమూల్ ఎంపీ.