తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'యువవైద్యులను ఫుట్​బాల్​లా భావించొద్దు' - సుప్రీంకోర్టు

పరీక్షల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆఖరి సమయంలో సిలబస్‌లో మార్పులు చేశారంటూ.. 41 మంది పీజీ వైద్యులు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానాన్ని(supreme court of india) ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. అధికారపు ఆటలో యువవైద్యులను ఫుట్‌బాల్‌లా భావించవద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించింది.

Supreme Court
సుప్రీంకోర్టు

By

Published : Sep 27, 2021, 7:58 PM IST

అధికారపు ఆటలో యువవైద్యులను ఫుట్‌బాల్‌లా భావించవద్దంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు(supreme court of india) హెచ్చరించింది. నీట్- సూపర్‌ స్పెషాలిటీ పరీక్షల సిలబస్‌లో ఆఖరి సమయంలో మార్పులు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై.. న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. యువ వైద్యుల జీవితాలను కొంతమంది కఠినులైన ప్రభుత్వ అధికారుల చేతుల్లోకి వెళ్లనీయమని వ్యాఖ్యానించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ వైద్య కమిషన్, జాతీయ పరీక్షల బోర్డు.. వారంలోగా సమావేశం కావాలని సూచించింది. సిలబస్ మార్పునకు సంబంధించి. బలమైన కారణాలతో రావాలన్న కోర్టు.. వాటితో సంతృప్తి చెందకపోతే నిబంధనలు వెల్లడిస్తామని తెలిపింది.

పరీక్షల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆఖరి సమయంలో సిలబస్‌లో మార్పులు చేశారంటూ.. 41 మంది పీజీ వైద్యులు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇదీ చూడండి:-న్యాయమూర్తుల విశ్వసనీయతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details