తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హిందుత్వంపై భాజపాకు ఉద్ధవ్ చురకలు - uddhav thackeray hits out bjp

హిందుత్వ అంశంపై భాజపాకు చురకలంటింటారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. తాము అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ పేరు పెడితే, వారు మాత్రం పటేల్ స్టేడియం పేరును మార్చేసి మోదీ స్టేడియం అని పెట్టారని ఎద్దేవా చేశారు. వారి నుంచి హిందుత్వ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.

Don't teach us Hindutva, why no Bharat Ratna for Savarkar yet: Uddhav to BJP
హిందుత్వంపై భాజపాకు ఉద్ధవ్ చురకలు

By

Published : Mar 4, 2021, 5:26 AM IST

హిందుత్వ విషయంలో భాజపా నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. హిందుత్వ సిద్ధాంతకర్త వీనాయక్​ దమోదర్ సావర్కర్​కు కేంద్రం ఎందుకు భారత రత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. తాము అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ పేరు పెడితే, వారు మాత్రం పటేల్ స్టేడియం పేరును మార్చేసి మోదీ స్టేడియం అని పెట్టారని ఎద్దేవా చేశారు. వారి నుంచి హిందుత్వ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విమర్శించారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో శివసేన పాల్గొనలేదన్న ఉద్ధవ్.... భాజపా మాతృసంస్థ ఆర్​ఎస్​ఎస్​ కూడా పాల్గొనలేదని చెప్పారు. కేవలం భారత్ మాతాకీ జై అన్నంత మాత్రాన దేశభక్తులైపోరని విరుచుకుపడ్డారు.

ఇదీ చూడండి: రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ

ABOUT THE AUTHOR

...view details