- 'మహారాష్ట్రలోని వ్యాపారులు కేంద్ర, రాష్ట్రాలు విధించిన జీఎస్టీని చెల్లించొద్దు. ఆ తర్వాత చూడండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనే కాదు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మీ ముందుకు వస్తారు.'ఈ మాటలు అన్నది స్వయానా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీనే.
మహారాష్ట్ర ఉల్హాస్‌నగర్‌లో జరిగిన వ్యాపారుల సంఘం సమావేశంలో ఈ మేరకు జీఎస్టీ చెల్లించొద్దని తోటి వ్యాపారులకు సూచించటం గమనార్హం. ప్రహ్లాద్ మోదీ.. ప్రస్తుతం ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.
రాజీవ్ గాంధీపై విమర్శలు..
భారత దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీపై విమర్శలు గుప్పించారు ప్రహ్లాద్ మోదీ. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా.. చమురు ధరల పెరుగుదల అనేది రాజీవ్ గాంధీ హయాంలోనే ప్రారంభమైందన్నారు. అందుకే.. బహిరంగ మార్కెట్ ప్రకారం వ్యాపారం చేయాలనుకుంటే దానిని భరించాల్సిందేనన్నారు.