బ్లాక్, ఎల్లో, వైట్ ఫంగస్ పేరుతో మ్యూకోర్మైకోసిస్ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో ఈ శిలీంధ్ర వ్యాధి వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అంటువ్యాధుల నిపుణులు. ఫంగస్ రంగుల గురించి ఆందోళన చెందవద్దని.. అది ఏ రకమైన ఇన్ఫెక్షనో, అందుకు గల కారణాలు, ఎదురయ్యే ముప్పును తెలుసుకోవడం ద్వారా సమస్యకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఫంగస్‌లోని రకాలను బ్లాక్, వైట్, ఎల్లో అంటూ పేర్కొనడం ద్వారా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయని ఐసీఎంఆర్‌కు చెందిన అంటువ్యాధుల విభాగ అధిపతి డాక్టర్ సమీరన్ పండా అన్నారు.
వాటిపై పరిశోధన అవసరం..
ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో నమోదైన ఎల్లో ఫంగస్ కేసుపై డాక్టర్ సమీరన్ స్పందించారు. ఎల్లో ఫంగస్ బల్లులు వంటి రెప్టైల్స్లో ఎక్కువగా గుర్తిస్తామని.. అయితే ప్రస్తుతం మనుషుల్లో నమోదవుతున్న ఈ ఫంగస్ అదే రకానికి చెందినదా కాదా అనే విషయంపై పరిశోధన చేయాల్సి ఉందన్నారు.
'అసలు కారణం ఏంటి?'