తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చర్చలు చాలు.. పౌరులందరికీ టీకా ఉచితంగా ఇవ్వండి'

దేశ పౌరులందరికీ ఉచితంగా కరోనా టీకాను పంపిణీ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ డిమాండ్ చేశారు. టీకా పంపిణీపై చర్చించింది చాలని అన్నారు.

Rahul Gandhi
రాహుల్ గాంధీ

By

Published : Apr 26, 2021, 1:39 PM IST

దేశంలోని పౌరులందరికీ కరోనా టీకాను ఉచితంగా అందించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దేశాన్ని భాజపా వ్యవస్థకు బాధితురాలిగా మార్చొద్దని మండిపడ్డారు.

"వ్యాక్సిన్​పై చర్చించింది చాలు. దేశ పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలి. భాజపా వ్యవస్థకు దేశం బాధితురాలిగా మిగిలిపోవడానికి వీల్లేదు."

-రాహుల్​ గాంధీ ట్వీట్‌

రాహుల్ గాంధీ చేసిన హిందీ ట్వీట్​..

దేశంలోని ప్రతి ఒక్కరికీ టీకాలు ఉచితంగా పంపిణీ చేయాలని రాహుల్ గాంధీతో పాటు.. కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ టీకా విధానం, దేశంలో కరోనా వైరస్​ కట్టడిపైనా పార్టీ విమర్శలు చేస్తోంది.

ఇక వ్యాక్సిన్ సరఫరా చేయకుండా తయారీదారుల వద్ద నుంచి నిల్వలను కేంద్రం "హైజాక్" చేస్తోందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆరోపించాయి. అంతేగాక మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి టీకా పంపిణీ సాధ్యమేనా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

పార్కింగ్ స్థలంలోనే కరోనా మృతదేహాల దహనం

ఆక్సిజన్​ కొరతతో రోగులు మృతి- బంధువుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details