దేశంలో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహల్ గాంధీ. నిబంధనలు పాటించి మహమ్మారిని తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసంతో వ్యవహరించిందని, నిర్లక్ష్యంతో మహమ్మారి ముప్పును అంచనా వేయలేకపోయిందని విమర్శించారు.
''ముందే హెచ్చరించినట్లు.. కరోనా ముప్పు కొనసాగుతోంది. దయచేసి అన్ని జాగ్రత్తలు పాటించండి. మాస్కులు ధరించండి.''
-రాహుల్ గాంధీ ట్వీట్.