కొత్త వ్యవసాయ చట్టాలపై అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరుతూ.. రైతులకు బహిరంగ లేఖ రాశారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్. ఈ చట్టాలపై కాంగ్రెస్, విపక్షాలు చేస్తున్న బూటకపు మాటలను పట్టించుకోవద్దని సూచించారు. అన్నదాతల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తన ఎనిమిది పేజీల లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:సాగు చట్టాల అమలు ఆపాలన్న సుప్రీం- నో చెప్పిన కేంద్రం
రైతు సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న తోమర్.. చిన్న, మధ్యస్థాయి రైతులకు ప్రయోజనం చేకూరాలనే లక్ష్యంతో కొత్త చట్టాలను తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కొనసాగించడం సహా.. ప్రస్తుతం ఉన్న మండీ వ్యవస్థను బలోపేతం చేస్తామని భరోసా ఇచ్చారు. అన్నదాతల భూములను కార్పొరేట్ సంస్థలు నియంత్రించేందుకు ఈ చట్టాల్లో ఎలాంటి నిబంధనలు లేవని ఈ సందర్భంగా తోమర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్, 40 మంది రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:సాగు చట్టాల ప్రతులను చించేసిన కేజ్రీవాల్
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు అనేక రైతు సంఘాలు మద్దతు ప్రకటించగా.. కొన్ని యూనియన్లు మాత్రం గందరగోళాన్ని సృష్టించాయని లేఖలో రాసుకొచ్చారు తోమర్. అయితే.. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. విపక్షాలు పన్నిన కుట్రను బహిర్గతం చేయడం సహా.. వాస్తవాలను బయటకు తీయడం తమ కర్తవ్యమని లేఖలో పేర్కొన్నారు.
లేఖ చదవండి: మోదీ