తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తప్పులు చేసిన వారికి ఎన్నికల విధులు వద్దు' - ఎన్నికల సంఘం లేఖ

వచ్చే శాసన సభ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం. గత ఎలక్షన్​ల్లో తప్పులు చేసిన వారిని ఈసారి విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ఈమేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

Don't deploy officials charged with lapses in previous elections: EC to poll-bound states
'తప్పులు చేసిన వారికి ఎన్నికల విధులు వద్దు'

By

Published : Jan 11, 2021, 8:04 AM IST

గత ఎన్నికల్లో తప్పులు చేసిన అధికారులకు రానున్న ఎలక్షన్లలో మళ్లీ విధులు అప్పగించకూడదని ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. ఆ మేరకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, కేరళ, బంగాల్​, పుదుచ్చేరిల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది.

క్రమశిక్షణ చర్యలకు గురైన వారికి, విచారణ పెండింగ్​లో ఉన్న వారికి, జరిమాన పడ్డ వారికి కూడా విధులు ఇవ్వకూడదని తెలిపింది. ఆరు నెలల్లో పదవీ విరమణ చేయనున్న వారికీ ఎన్నికలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించకూడదని పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఎన్నికల అధికారులకు వేధింపుల నుంచి రక్షణ!'

ABOUT THE AUTHOR

...view details