తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లీటరు పాలు రూ.10వేలు- ఎక్కడో తెలుసా?

లీటరు పాల ధర ఏకంగా రూ. 10 వేలు పలుకుతోంది. అయితే.. ఆ పాలు ఏ గేదెవో, ఆవువో కాదు.. ఓ గాడిదవి అంటే నమ్మగలరా? మరి గాడిద పాలకు ఇంత ధర ఎందుకు ఉందో తెలుసుకోండి.

milk, donkey milk
గాడిద పాలు, మహారాష్ట్ర

By

Published : Aug 10, 2021, 1:49 PM IST

గాడిద పాలకు భలే గిరాకీ..

ఆవు, గేదె పాలకు డిమాండ్​ బాగా ఉంటుందని మనకు తెలుసు. కానీ, మహారాష్ట్ర ఉస్మానాబాద్​లో మాత్రం గాడిద పాలకు భలే గిరాకీ ఉంది. అయితే.. ధర తక్కువగా ఉన్నందువల్లే ఇంత డిమాండ్​ ఉందని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఈ గాడిద పాల ధర లీటరుకు రూ. 10 వేల వరకు అమ్ముతున్నారంటే నమ్మశక్యంగా అనిపించదు.

పిల్లలకు గాడిద పాలు తాగిస్తున్న వ్యాపారి
10 మిల్లీలీటర్ల పాలు రూ. 100

ఉమర్గాకు చెందిన ధోత్రే కుటుంబీకులు దాదాపు 20 గాడిదలతో పాల వ్యాపారం చేస్తున్నారు. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండడం వల్లే ఈ పాలకు భారీగా డిమాండ్ ఉందని లక్ష్మీబాయి ధోత్రే తెలిపారు. ప్రస్తుతం 10 మిల్లీలీటర్ల పాలు రూ. 100కు విక్రయిస్తున్నట్లు చెప్పారు. చిన్నపిల్లలకు ఈ పాలు ఎంతో బలాన్నిస్తాయని ధోత్రే వివరించారు.

గాడిద పాలు తాగితే విటమిన్ డీ పుష్కలంగా లభిస్తుందని, చర్మం మృదువుగా తయారవుతుందని చాలా మంది నమ్ముతుంటారు.

ఇదీ చదవండి:మీ పేరు అదేనా? అయితే పెట్రోల్​ ఫ్రీ!

ABOUT THE AUTHOR

...view details