DOMINO'S PIZZA GIRL ATTACK:డామినోస్ పిజ్జా డెలివరీ ఉద్యోగినిపై కొంతమంది మహిళలు దాడి చేశారు. వీధిలోనే మహిళపై చెయ్యి చేసుకున్నారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాడి చేస్తున్న డామినోస్ ఉద్యోగిని గట్టిగా కేకలు పెట్టడం వీడియోలో తెలుస్తోంది. చుట్టూ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఆమెను కాపాడేందుకు ముందుకురాలేదు.
దాడి చేసిన మహిళలు స్థానిక గ్యాంగ్‌కు చెందినవారని తెలిసింది. వీడియోను నిందితులే సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేస్తానని బాధితురాలు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. అయినా మహిళా గూండాలు తగ్గలేదు. పోయి పోలీసులను పిలుచుకురా అంటూ సవాల్ విసిరారు. కాసేపటికి బాధితురాలు ఓ ఇంట్లోకి వెళ్లి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది.