తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశీయ విమాన ప్రయాణాలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశీయంగా నడిచే విమానాల్లో పూర్తిస్థాయి సీటింగ్​కు అనుమతి ఇచ్చింది విమానయాన మంత్రిత్వ శాఖ. కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Domestic flights can operate at full capacity from October 18
దేశీయ విమానాల్లో పూర్తి స్థాయి సీటింగ్​కు అనుమతి

By

Published : Oct 12, 2021, 4:51 PM IST

దేశీయ విమాన సర్వీసులకు సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీట్ల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేసింది. అక్టోబర్​ 18 నుంచి.. ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

క్రమక్రమంగా..

గతేడాది లాక్‌డౌన్ సమయంలో దేశీయ విమానాలపై పూర్తి నిషేధం విధించింది కేంద్రం. లాక్‌డౌన్ అనంతరం 2020 మే 25న కొవిడ్ నిబంధనల మేరకు 33 శాతం సీటింగ్ కెపాసిటీతో విమానాలు నడిపేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ వరకు క్రమంగా 80 శాతానికి పెంచగా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 1న ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించింది. అనంతరం ఆగస్టు 12 నాటికి ఆక్యుపెన్సీని 72.5 శాతానికి పెంచింది. సెప్టెంబర్​లో 85 శాతం సీటింగ్ సామర్థ్యంతో విమానాలను నడుపుకొనేందుకు విమానయాన సంస్థలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇప్పుడు కొవిడ్​ కేసులు కనిష్ఠస్థాయికి చేరుతున్న క్రమంలో.. సీటింగ్​ సామర్థ్యంపై పూర్తి ఆంక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిడ్​ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: వెనక్కి తగ్గిన బ్రిటన్​.. భారత్​ ప్రయాణికులపై ఆంక్షల సడలింపు

Flight Ban India: అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details