Dollar Temple in Gujarat: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వరదాయిని మాతా దేవాలయం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది 'డాలర్ టెంపుల్'గా దర్శనమిచ్చింది. గాంధీనగర్ పరిధిలోని రూపాల్ గ్రామంలో ఉన్న వరదాయిని మాత ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఏటా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. ఉత్సవాల సందర్భంగా పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంగా మారుతుంది. గుజరాత్ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు.
అమ్మ వారి కోసం 'డాలర్ టెంపుల్'.. రూ.లక్షలు విలువైన కరెన్సీతో...
Dollar Temple in Gujarat: 'డాలర్ టెంపుల్'.. వినడానికి కొత్తగా ఉంది కదా! గుజరాత్లో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది ఉత్సవాల సందర్భంగా ఇలా దర్శనమిచ్చింది. మరి.. డాలర్ టెంపుల్‌ను ఓసారి చూసొద్దాం పదండి..!
ప్రతి సంవత్సరంలాగే ఈ సారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు ఉత్సవం తొమ్మిదో రోజు మహా పరిషత్ నిర్వహించారు. యూఎస్ఏలో ఉండే ఓ భక్తురాలు 11,500 డాలర్లను అమ్మవారికి కానుకగా సమర్పించింది. వీటి విలువ మన దేశ కరెన్సీలో రూ.2.5 లక్షలు. నిర్వహకులు ఈ డబ్బులతోనే అమ్మవారిని అలంకరించారు. దేవాలయ ప్రాంగణమంతా డాలర్లతోనే తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో వరదాయిని మాతా దేవాలయం ఈ ఏడాది 'డాలర్ టెంపుల్'గా దర్శనమిచ్చింది. దేవాలయానికి కానుకలు అధిక మొత్తాల్లో వస్తుంటాయి. అందులో 50 శాతానికిపైగా ఆలయ నిర్మాణం కోసం ఖర్చుచేస్తారు.
ఇదీ చదవండి:వెయిటర్‌గా వయ్యారాల రోబో సుందరి.. చిటికెలో ఆర్డర్ డెలివరీ!